»Good News For The People Of Ap 23 New Types Of Jobs Under Employment Guarantee
Andhrapradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..’ఉపాధి హామీ’లో కొత్తగా 23 రకాల పనులు
ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధి హామీలో కొత్తగా 23 పనులను చేర్చుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అలాగే త్వరలోనే బకాయిలు ఉన్న కూలీలకు వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు.
ఏపీ(AP) ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్(Good News) చెప్పనుంది. 23 రకాల పనులతో వర్షాకాలంలోనూ ఉపాధి పనులు(Employment works) నిర్వహించాలని జగన్(cm jagan) సర్కార్ ప్రణాళిక వేస్తోంది. వర్షాకాలంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి పనులు చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. ఇందు కోసం రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది.
మురుగు, వరద నీరు మళ్లింపు, కాలువలు తవ్వడం, బ్రిడ్జిలు ఏర్పాటు, పైపు కల్వర్టుల పూడికతీత పనులు, రోడ్లు, నీటిపారుదల కాలువ వెంబడి మొక్కలు నాటే పనులు, కొండలపై నుంచి పారే వర్షపు నీరు నిల్వకు వీలుగా ట్రెంచ్ ల ఏర్పాటు వంట 23 రకాల పనులను ఉపాధి హామీ పథకంలో చేర్చనుంది. ఇప్పటికే అనుమతి ఉన్న పనులతో పాటు ఈ పనులను కూడా ఇకపై కూలీలకు సర్కారు అప్పగించనుంది.
జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు హాజరయ్యే కూలీల పెండింగ్ వేతనాలపై అధికారులు స్పందించారు. త్వరలోనే ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాల్లో పెండింగ్ వేతనాలు జమ చేస్తామని తెలిపారు. గత 5 వారాల నుంచి చెల్లింపులు నిలిచిపోయాయని, అయితే కొన్ని జిల్లాల్లో ఇప్పటికే చెల్లింపులు ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే అందరికీ నగదు జమ అవుతుందన్నారు.