TG: మూసీ ప్రాజెక్ట్ పేరుతో రూ.4 వేల కోట్ల అప్పు చేశారని BJP చీఫ్ రాంచందర్ రావు మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రాజెక్ట్ అని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు లేవు కానీ.. మూసీ ప్రాజెక్ట్‌కు మాత్రం నిధులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మూసీ బాధితులకు BJP అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.