AP: విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం చిన్న విషయం కాదని PCC అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ‘విజయసాయి జగన్కు అత్యంత సన్నిహితుడు. జగన్ ఏ పని ఆదేశిస్తే…ఆ పని చేయడం ఆయన పని. అలాంటి వ్యక్తే జగన్ను వదిలేశాడంటే YCP కార్యకర్తలు, YS అభిమానులు ఆలోచించండి. సొంత వాళ్లను కూడా జగన్ కాపాడుకోలేకపోతున్నారు. జగన్ కోసం విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారు’ అని షర్మిల జోస్యం చెప్పారు.