సచిన్ తన కుమార్తె సారాకు కొత్త బాధ్యతలు అప్పగించాడు. ఈ మేరకు సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్గా ఆమె బాధ్యతలు స్వీకరించింది. ఆమెకు వైద్యరంగంపై ఉన్న విద్యా పరిజ్ఞానం సమాజ సాధికారతకు తోడ్పడుతుందని పేర్కొన్నాడు. కాగా, సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్.. మారుమూల పల్లె ప్రాంతాల్లోని పిల్లలకు వైద్య సేవలు అందిస్తూ, పోషకాహార లోపాన్ని అధిగమించేలా సహాయ కార్యక్రమాలు చేపడుతోంది.