నోబెల్ శాంతి బహుమతి విజేత నర్గీస్కు తాత్కాలిక ఉపశమనం లభించింది. వైద్యకారణాలతో మూడు వారాల కోసం ఆమెను ఇరాన్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. 2021 నవంబర్ నుంచి ఆమె జైల్లోనే ఉన్నారు. ఇరాన్లో రాజకీయ ఖైదీలు, ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. జైల్లో ఉన్న సమయంలోనే 2023లో ఆమెకు నోబెల్ బహుమతి లభించింది.