నానబెట్టిన శనగలు తినలేదని భార్య, భర్త వేలును కొరికిన ఘటన మహారాష్ట్ర పూణెలో జరిగింది. సోమవార్పేటలో ఓ కుటుంబం నివాసముంటుంది. డిసెంబర్ 1న నానబెట్టిన శనగలు తినమని భర్తకు భార్య ఇవ్వగా.. వాటిని తినటం తనకు ఇష్టం లేదని అతడు తిరస్కరించాడు. దీంతో ఆగ్రహించిన భార్య సుత్తితో అతడి తలపై దాడి చేసేందుకు యత్నించింది. దాడి నుంచి తప్పించుకునేందుకు తలకు అడ్డుగా చేతులు పెట్టడంతో అతడి వేలుని కొరికేసింది. తర్వాత విచక్షణారహితంగా కొట్టింది.