AP: కాకినాడ స్టెల్లా నౌకలో తనిఖీలు కొనసాగుతున్నాయి. రేషన్ బియ్యం ఆనవాళ్ల కోసం ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. బియ్యం నమూనాలను అధికారులు సేకరిస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు బియ్యం నమూనాల సేకరణ కొనసాగనుంది. కాకినాడ పౌరసరఫరాల శాఖ ల్యాబ్లో నమూనాలు పరీక్షించే అవకాశం ఉంది. తనిఖీల్లో 10 అధికారులు పాల్గొన్నారు.