CAPFలో జవాన్ల ఆత్మహత్యలు పెరిగినట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ తెలిపింది. ఎక్కువ గంటలు డ్యూటీ చేయడం, నిద్రలేమే ఆత్మహత్యలకు కారణంగా తెలుస్తోంది. 730 మంది జవాన్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, 55,000 మందికి పైగా రాజీనామా లేదా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారని వెల్లడించింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి సిబ్బందికి 100 రోజుల సెలవు విధానం సాయపడుతుందని పేర్కొంది. ఈ విధానం ద్వారా జవాన్లు తమ కుటుంబాలతో మరింత సమయం గడపొచ్చని తెలిపింది.