భారతీయ రైల్వేలో మొత్తం 99,809 మంది మహిళా ఉద్యోగులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందులో 2,037 మంది లోకోపైలట్లుగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపింది. పురుషులతో పోలిస్తే మహిళా లోకోపైలట్ల సంఖ్య ఎంత అని బీజేపీ ఎంపీ లోక్సభలో ప్రశ్నించారు. ఇందుకు కేంద్రమంత్రి బదులిస్తూ.. నిర్దేశించిన నిబంధనల ప్రకారమే వివిధ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పారు.