కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో నీటి కొరత నెలకొందని మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ రాజ్యసభలో ప్రస్తావిచారు. బెంగళూరులో నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిశీలించాలని ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్రాన్ని చేతులు జోడించి వేడుకుంటున్నట్లు మాజీ ప్రధాని తెలిపారు. నగరంలో నీటి సరఫరా కోసం ప్రైవేట్ ఆపరేటర్లు ప్రజల దగ్గర విపరీతంగా వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.