AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ కొనసాగుతోంది. గుంటూరు జీజీహెచ్ సిబ్బందిని ప్రకాశం ఎస్పీ దామోదర్ విచారించారు. ఈ విచారణకు జీజీహెచ్ ఆర్ఎంవో సతీష్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేంద్ర, ఈసీజీ టెక్నీషియన్ నాగరాజు హాజరయ్యారు. ఒంగోలు కార్యాలయంలో ముగ్గురినీ ఎస్పీ 5 గంటల పాటు విచారించారు.