బిహార్‌కు చెందిన స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్‌కు కొంతకాలంగా బెదిరింపు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇటీవల ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు.. పప్పూ మద్దతుదారుడేనని, ఆయనను బెదిరించాలని ఎంపీ అనుచరులే అతడికి డబ్బులు ఇచ్చినట్లు విచారణలో చెప్పాడని పోలీసులు తెలిపారు. ఎంపీకి ‘జడ్’ సెక్యూరిటీ కోసమే పథకం ప్రకారం ఇదంతా చేస్తున్నట్లు అనుమానిస్తున్నామని వెల్లడించారు.