మహారాష్ట్ర సీఎంగా ఎన్నికైన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ మొదటగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. వార్డు స్థాయి నాయకుడిగా ప్రారంభమై ఇప్పుడు మూడోసారి సీఎంగా అయ్యానని తెలిపారు. 2019లో నెలకొన్న పరిస్థితి తర్వాత ఒక్క ఎమ్మెల్యే కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదని ఆయన గుర్తుచేశారు. తామందరూ కలిసికట్టుగా ఉండి 2022లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు గర్విస్తున్నానని పేర్కొన్నారు.