నిర్మాణ రంగ కార్మికులకు ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలో నిర్మాణ పనులపై బ్యాన్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఉపాధిని కోల్పోతున్న 90 వేల మందికిపైగా నిర్మాణ రంగ కార్మికులకు రూ.8వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. 2024 నవంబరు 25 నాటికి క్రియాశీలక సభ్యత్వం కలిగిన నిర్మాణ రంగ కార్మికులు ఈ ఆర్థికసాయాన్ని పొందేందుకు అర్హులు.