UPI లైట్‌కు సంబంధించి RBI కీలక ప్రకటన చేసింది. UPI లైట్ వాలెట్ పరిమితిని రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచింది. అలాగే, ఒక్కో లావాదేవీ పరిమితిని సైతం రూ. 500 నుంచి రూ.1000 పెంచుతున్నట్లు తెలిపింది. సత్వరమే జరిగే ఈ డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో లైట్ పరిమితిని పెంచినట్లు RBI పేర్కొంది. అక్టోబర్‌లో ఎంపీసీ భేటీ సందర్భంగా ఈ ప్రకటన చేసింది.