TG: అసెంబ్లీలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా సభ్యుల చెప్పేది వినాలి, అంతరాయం కలిగించొద్దు. ప్రతిసారీ మంత్రులు జోక్యం చేసుకుంటే సభకు గౌరవం ఉండదు. సభలో సభ్యుల హక్కులు కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌దే. మేం మాట్లాడుతున్నప్పుడు సీఎం, డిప్యూటీ సీఎంకు మాట్లాడే హక్కు ఉంటుంది. మంత్రులందరూ స్పందించడం సభా మర్యాద కాదు’ అని పేర్కొన్నారు.