TG: టీచర్ రిక్రూట్మెంట్ కోసం డీఎస్సీ నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కలెక్టర్లను బదిలీ చేసినంత ఈజీ కాదు టీచర్లను బదిలీ చేయడమంటూ వ్యాఖ్యానించారు. ఒక్క ఆరోపణ కూడా రాకుండా 36 వేల మంది టీచర్ల బదిలీలు పూర్తి చేశామని తెలిపారు. 20 ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని పేర్కొన్నారు.