కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గంలోని నీటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలని MLA కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం మిషన్ భగీరథ అధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి సమస్య పరిష్కరించాలన్నారు. నియోజకవర్గాల్లోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాలలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.