JGL: జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పూడికతీత పనులు చేపడుతుండగా ఉపాధి హామీ కూలీ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ కుంట లక్ష్మినర్సు అనే మహిళ గ్రామ శివారులోని కాల్వ పూడికతీత పనులు చేపడుతుండగా ఉన్నట్టుండి కుప్పకూలి అక్కడిక్కడే మృతిచెందింది. మృతురాలి భర్త గత కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు.