ATP: అనంతపురంలోని అంబేద్కర్ భవన్లో ముస్లింల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని కొనియాడారు. ముస్లిం మైనారిటీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.