PDPL: న్యాయవాది ఇజ్రాయిల్ దారుణ హత్య ఘటనపై గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ప్రారంభించారు. ఈరోజుతో నిరసన దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. న్యాయవాదులు గొర్రె రమేష్, శైలజ, తిరుపతి రావు, కిషన్ రావు, మురళి, దాట్ల కిరణ్, కుషాన, రజిత పాల్గొన్నారు. వీరికి HMS నాయకులు జక్కుల నారాయణ, సంతోష్, నాన గౌడ్ పలువురు మద్దతు ఇచ్చారు.