ATP: నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలను ఎప్పటికప్పుడు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం అనంతపురం రూరల్ పరిధిలోని ఆలమూరులో వైద్య ఆరోగ్యశాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖ పరిధిలో చేపడుతున్న నీటి నాణ్యత పరీక్షలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. వేసవి నేపథ్యంలో నీటి నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.