ATP: ఉగాది పండగ, ఆదివారం అయినప్పటికీ గుత్తిలో విద్యుత్ బిల్లుల చెల్లింపు కౌంటర్లు పనిచేస్తాయని ఏపీఎస్పీడీసీఎల్ డీఈఈ పద్మనాభ పిళ్ళై చెప్పారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. యధాతధంగా ఆదివారం కూడా విద్యుత్ కౌంటర్లు పనిచేస్తాయన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌంటర్లు తెరిచే ఉంటాయన్నారు.