IPLలో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై ఇప్పుడు అంతా చర్చ సాగుతోంది. అయితే దీనిపై ఈ సీజన్‌కు ముందే ధోనీ స్పష్టత ఇచ్చాడు. ‘విరిగిపోని దానిని మళ్లీ అతికించడం ఎందుకు? బ్యాటర్లు మంచిగా పరుగులు చేస్తున్నప్పుడు సమస్య ఏముంది. ఒకటీ, రెండు మ్యాచుల్లో ఫలితం అనుకూలంగా రాకపోయినా.. కంగారుపడాల్సిన అవసరం లేదు. ప్రతిసారీ ఇలాగే జరిగితే మాత్రం నా ఆలోచనల్లో మార్పు రావచ్చు’ అని వెల్లడించాడు.