JN: జనగామ జిల్లాలో డా.బాబు జగ్జీవన్ రామ్, డా.బి.ఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ సంఘాలు, నాయకుల వద్ద నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు.