MHBD: కూరవి మండల కేంద్రంలో తక్షణమే ప్రభుత్వ జూనియర్ కలశాలను ఏర్పాటు చెయ్యాలని శనివారం PDSU,LSO జిల్లా నాయకులు బాణోతు దేవేందర్, గుగులోతూ శివ వర్మ తహసీల్దార్ సునీల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.