TG: గ్రామపాలన అధికారులుగా మాజీ VRO, VRAల నియామకంపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. విధివిధానాలు, అర్హతలను రెవెన్యూ శాఖ ఖరారు చేసింది. డిగ్రీ అర్హత ఉన్న మాజీ VRO, VRAలను జీపీవోలుగా అవకాశం కల్పించింది. ఇంటర్‌తో పాటు ఐదేళ్లు VRO లేదా VRAలుగా అనుభవం ఉన్నవారిని అర్హులుగా ప్రకటించింది. వీరిని స్క్రీనింగ్ పరీక్ష ద్వారా GPOలుగా ఎంపిక చేయనుంది.