ATP: గుంతకల్లు కసాపురం ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. శనివారం సాయంకాలం ప్రత్యేకంగా అలంకరించిన వెండి రథంలో కొలువు తీర్చి స్వామివారికి ఆలయ వాణి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో ప్రాకారోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద సంఖ్యలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.