ASR: చింతపల్లి మండలంలోని సాయినగర్ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నయ్యపడాల్ శనివారం మీడియాకు తెలిపారు. చింతపల్లి మేజర్ పంచాయతీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ముఖ్యంగా సాయినగర్‌లో నివాసం ఉంటున్న గిరిజనులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. సాయి నగర్లో వాటర్ ట్యాంక్ నిర్మించాలని కోరారు.