సత్యసాయి: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్టు ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, తదుపరి తేదీపై త్వరలో సమాచారం అందించనున్నట్టు వెల్లడించారు.