TG: హైదరాబాద్లో రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఉమ్మడి ఏపీలో ఎవరు సీఎం అయినా నెంబర్.2 గా రోశయ్యనే కోరుకునేవారు. సీఎంలు ధీమాగా రాష్ట్రాన్ని పాలించారంటే రోశయ్య ఆర్థిక మంత్రిగా ఉండటమే కారణం. చట్టసభల్లో ఆయన బలమైన ముద్ర వేశారు. రాష్ట్ర ఆర్థిక రంగంలో రాణించాలంటే ఆర్యవైశ్యుల పాత్ర ముఖ్యం. రాజకీయాల్లోనూ ఆర్యవైశ్యులకు మంచి అవకాశం కల్పిస్తాం’ అని తెలిపారు.