HYD: నగరంలో పోలీసుల ఆధ్వర్యంలో త్వరలో కొత్త క్రికెట్ స్టేడియం రానుంది. పోలీస్ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం ప్రభుత్వం అంబర్ పేట, ఆరాంఘర్ ప్రాంతాల్లో స్థలాలు కేటాయించింది. ఆరాంఘర్ ప్రాంతం మరింత అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ స్టేడియంను క్రికెట్ ప్రాక్టీస్ కోసం, మ్యాచ్ల నిర్వహణ కోసం క్రికెటర్లకు అద్దెకు ఇవ్వాలని కూడా అధికారులు యోచిస్తున్నారు.