AP: పోలవరం(D) దేవీపట్నం(M) గంగంపాలెంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గంగంపాలెం వద్ద రాత్రి పశువులపై పెద్దపులి దాడి చేసింది. 14 ఆవుదూడలను, 2 గేదె దూడలను, ఒక గేదెను చంపింది. పెద్దపులి సంచారంతో గంగంపాలెం వాసులు భయాందోళనకు గురవుతున్నారు. గంగంపాలెం దండింగి, పోచమ్మగండి వైపునకు ప్రజలు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, పోతవరం వద్దే వాహనాలను అటవీశాఖ అధికారులు నిలిపివేస్తున్నారు.
Tags :