AP: ఉత్తమ ఉపాధ్యాయులకు సీఎం చంద్రబాబు అవార్డులు ప్రదానం చేశారు. టీచర్లను జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేమని అన్నారు. పిల్లల్లో స్ఫూర్తిని కలిగించేది, మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి బయటకు తీసేది గురువులేనని చెప్పారు. భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడు తన జీవితంలో స్ఫూర్తి నింపారని వెల్లడించారు. తాను నిత్య విద్యార్థినని.. ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటానని పేర్కొన్నారు.