AP: రాజధానిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెదపరిమి గ్రామంలో భూ సమీకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6,000 ఎకరాల్లో తొలి విడతగా 3,072 ఎకరాలను సేకరించనుంది. ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే కనెక్టివిటీ, స్పోర్ట్స్ సిటీ వంటి కీలక ప్రాజెక్టులకు ఈ భూములు కీలకం కానున్నాయి. 11 ప్రధాన రహదారులు కలిసే ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.