AP: మాజీ సీఎం జగన్ పార్టీ నేతలతో కాసేపట్లో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహం రచిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజా పోరాటం ఎలా చేయాలనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. పార్టీకి సంబంధించిన కమిటీల ఏర్పాటు గురించి, పార్టీని ముందుకు తీసుకెళ్లే అంశంపై నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు.