TG: మావోయిస్టు పార్టీలో విభేదాలు వాస్తవమేనని మాజీ మావోయిస్ట్ వికాస్ అన్నారు. అగ్ర నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. ఆయుధాలు వదిలిపెట్టాలనే చర్చ పార్టీలో ఎప్పటినుంచో ఉందని స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీలో ఆధిపత్య పోరు సహజమేనని పేర్కొన్నారు. మావోయిస్టు కీలక నేతలు మల్లోజుల, జగన్ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని వెల్లడించారు.