W.G: తణుకు పట్టణంలో సంచలనం సృష్టించిన దోపిడీ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల వారణాసి వారి వీధిలో వాకలపూడి కనకదుర్గ ఇంట్లో చోరీకి పాల్పడిన మహారాష్ట్ర, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన నిందితుల వద్ద నుంచి 10 బంగారు గాజులు, చెవి దుద్దులు, చెవి మాటీలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే చోరీకి ఉపయోగించిన కత్తులు, చాకులను సీజ్ చేశారు.