JN: అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలు, పిల్లల హాజరు శాతాన్ని పెంచాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్లో అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై శుక్రవారం సమీక్ష నిర్వహించి వారు మాట్లాడారు. సిబ్బంది పనితీరును మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ఆహార నాణ్యతను నిరంతరం పరిశీలించాలన్నారు. పిల్లలకు వైద్య పరీక్షలు చేయాలన్నారు.