MDK: హవేలీ ఘనాపూర్ మండలం శమ్నాపూర్లో మల్లయ్యను హతమార్చిన భార్య లక్ష్మికి జీవిత ఖైదు, రూ. 5000 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. లక్ష్మికి మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉండడంతో తరచూ గొడవలు జరిగాయి. 2020 ఫిబ్రవరి 25న గొడవ పడి హత్య చేసినట్లు రుజువు కావడంతో ఈరోజు శిక్ష ఖరారు చేశారు.