WNP: మదనాపురం మండలం కొత్తకోట – ఆత్మకూర్ రోడ్డులోని ఊక చెట్టు వాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పెండింగ్ పనులకు రూ.6 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు శుక్రవారం R&B చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి జీవో కాపీని అందజేశారు. సోమవారం నుంచి వంతెన నిర్మాణ పెండింగ్ పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు.