KMR: డబ్బుల విషయంలో జరిగిన హత్య కేసులో 8మందిని అరెస్టు చేసినట్లు బాన్సువాడ DSP విఠల్ రెడ్డి పేర్కొన్నారు. మద్నూర్ మండలం సోమూరులో SEP 28న డబ్బులు బాకీ విషయంలో రాజ్‌కుమార్ తిట్టడంతో, ఆగ్రహించిన 8మంది అతన్ని తీవ్రంగా కొట్టారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండుకు తరలించినట్లు DSP వెల్లడించారు.