ADB: జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం ఈనెల 13న సోమవారం రోజున యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి ప్రజావాణికి యధావిధిగా రావాలని సూచించారు.