MBNR: క్షణికావేశంలో రైలు క్రిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం జడ్చర్ల నియోజకవర్గంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన గూని యాదయ్య తన భార్యతో గొడవపడి క్షణికావేశంలో రాజపూర్ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు యాదయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.