NZB: రాష్ట్రస్థాయి తైకాండో పోటీలకు నగరంలోని సెయింట్ జూడ్స్ పాఠశాలకు చెందిన చోకం ఓంకార్ ఎంపికైనట్లు PETలు సుమన్ నాయక్, కిషోర్ తెలిపారు. ఇటీవల జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీలో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు తేవాలని పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల బృందం సూచించారు.