PDPL: తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ..యూనియన్ నాలుగో రాష్ట్ర మహాసభలు నవంబర్ 9న సంగారెడ్డిలో జరగనున్నాయని తెలిపారు. వైద్య ఆరోగ్య రంగంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, ప్రమోషన్లు, భద్రత, సంక్షేమానికి యూనియన్ నిరంతరం కృషి చేస్తోందన్నారు.