SDPT: హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలోని గోదాం గడ్డ బస్తీ దవాఖానను జిల్లా కలెక్టర్ కే.హైమావతి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. మెడికల్ ఆఫీసర్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని సిబ్బంది కలెక్టర్కు తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ.. త్వరలోనే డాక్టర్ వచ్చేలా చూస్తానని, అప్పటివరకు రోగులకు ఓపికగా వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.