SDPT: జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ గ్రామ సమీపంలోని శ్రీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయ హుండీ కానుకలను దేవాదాయ, ధర్మాదాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కించారు. భక్తుల నుంచి వివిధ కానుకల రూపంలో అమ్మవారి హుండీలో డబ్బులు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి 94 రోజులకు గాను రూ.4,36,090లు వచ్చినట్లు ఆలయ ఈవో రవికుమార్ తెలిపారు.