SRD: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ పరిధిలోని జేఎన్టీయూలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల జీవితాలు నాశనం అవుతాయని చెప్పారు. ఆన్లైన్లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని పేర్కొన్నారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ నరసింహ పాల్గొన్నారు.