ATP: రాప్తాడు నియోజకవర్గం కొండపల్లిలో శ్రీ సీతా రామాలయం ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆమెను ఆశీర్వదించారు. ఆలయ నిర్మాణంలో గ్రామస్థుల చొరవను ఎమ్మెల్యే అభినందించారు. ప్రజలపై శ్రీ సీతారాముల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.